ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం, తలార్లపల్లి గ్రామాలకు చెందిన పాత నాటు సారాయి కేసులలో నిందితులుగా ఉన్న మారోని, పున్నా అనే ఇద్దరు మహిళలను ఎక్సైజ్ పోలీసులు చింతలపూడి తహశీల్దార్ ఎదుట హాజరుపరిచారు. తహశీల్దార్ వారిద్దరిపై బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ వెల్లడించారు.