హైదరాబాద్ నగర దాహార్తి తీర్చే మంజీరా తాగునీటి సరఫరా పథకం రూపురేఖలు మార్చాలని జలమండలి నిర్ణయించింది. పైపు లైన్లు తరచుగా పగలడం, లీకేజీలకు గురవుతుండడంతో వాటిని ఆధునీకరించడం, మరో అధునాతన లైన్ నిర్మించేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు సుమారు రూ.722 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది.