BHPL: భారత స్వాతంత్ర్యానికి 100 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో తెలంగాణ భవిష్యత్తును రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గత వారం ప్రారంభమైన ఈ సర్వే ఈనెల 25 వరకు కొనసాగుతుందని, ప్రతి పౌరుడు www.telangana.gov.in/telanganarising లో పాల్గొని సలహాలు, సూచనలు అందించాలని కోరారు.