SRD: రుద్రారం గీతం విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓరిగామి ప్రదర్శనను నిర్వహించి, తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవతో కలిసి రెండు కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. ఈ విజయంతో ఆమె మొత్తం 21 గిన్నిస్ రికార్డులను సాధించింది.