AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తం కాగా, నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.