దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ చిత్రం క్రిస్మస్ బరిలో నిలిచింది. ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం దీపావళి సందర్భంగా ప్రకటించింది.