ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 8-10 గంటల మధ్యలోనే క్రాకర్స్ కాల్చాలని పోలిసు అధికారులు సూచించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు టపాసులు కాల్చేటపుడు పెద్దల దగ్గర ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని తెలిపారు. ప్రమాదాల నివారణకు నీరు, ఇసుక దగ్గర ఉంచాలని, పబ్లిక్ రోడ్డు పై క్రాకర్లు కాల్చకూడదని హెచ్చరించారు.