హైదరాబాద్ రామంతపూర్‌లోని ఆనందనగర్‌లో దుర్ఘటన చోటు చేసుకుంది. రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన నరసింహా (56) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మోత్కూరు గుండాల మండలానికి చెందినవాడిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.