VSP: వాల్తేరు డిపోలో అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె ఆదివారం కూడా కొనసాగింది. ఈ మేరకు డిపోకు చెందిన 29 బస్సులు నిలిచిపోయాయి. కార్యదర్శి బి. జంపన్న మాట్లాడుతూ.. రూ. 26,000కి జీతం పెంచాలని, పీఎఫ్, ఈ ఎస్సై అమలు చేయాలన్నారు. నైట్ హాల్ట్ అలవెన్సులు, దసరా బోనస్, రెండు జతల బట్టలు ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు.