W.G: జిల్లాలో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అవగాహన కార్యక్రమాల నిర్వహణ అద్భుతమని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన ఈ కార్యక్రమ ముగింపు ఉత్సవాల్లో ఆదివారం ఆయన మాట్లాడారు. తగ్గిన జీఎస్టీ ధరలు క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్నదీ, లేనిదీ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.