WNP: జిల్లాలో ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలుకు 490 కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అధికారులు సన్నాహాలు చేశారు. జిల్లాలో 1.99 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 4.69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వం 4.30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389గా అధికారులు నిర్ణయించారు.