HNK: హాసన్ పర్తి మండలం సీతంపేటలో భిన్నమైన సంప్రదాయం ఉంది. మొదటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దసరా ముందు బతుకమ్మ ఆడితే, ఇక్కడ మాత్రం దీపావళి నుంచి 3 రోజుల పాటు చేయడం ఆనవాయతీగా వస్తోంది. నేతకానీ కులస్థుల ఆధ్వర్యంలో రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 21న మట్టితో ఎడ్ల బొమ్మలు చేసి నోముకుంటారు. 22న వాటిని నిమజ్జనం చేస్తారు.