చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,420 మంది రైతులకుగాను 2,150 హెక్టార్లకు సూక్ష్మసేద్యం రాయితీలు మంజూరు చేసామని సూక్ష్మ నీటిపారుదల పథకం ఈడీ రమణ తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 12 వేల హెక్టార్లలో సూక్ష్మసేద్యం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అర్హత కలిగిన లబ్దిదారులకు సకాలంలో సేద్యం పరికరాల సరఫరా, అమర్చడం పూర్తి చేస్తున్నామన్నారు.