ప్రకాశం: పామూరులోని ఆకులవీధిలో కుటుంబ సాధికార కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. పీఎసీఎస్ ఛైర్మన్ ఉప్పలపాటి హరిబాబు మాట్లాడుతూ.. కేఎస్ఎస్ సభ్యులుగా నియమితులైన వారు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా అందనివారిని గుర్తించి, అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.