దీపావళి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. 140 కోట్ల భారతీయుల కష్టం, తెలివితేటలు, నూతన ఆవిష్కరణలను గుర్తిస్తూ ఈ పండుగను జరుపుకుందామన్నారు. పండుగ వేళ స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. తద్వారా ఇతరులు కూడా స్వదేశీ ఉత్పత్తులు వాడేందుకు ప్రేరణ పొందుతారని మోదీ తెలిపారు.