MDCL: ఉప్పల్ PS పరిధిలోని ఆనంద్ నగర్లో ఈరోజు తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా మామిడి ఆకులు తెంపుతున్న నరసింహ అనే వ్యక్తి రెండస్తుల భవనం పైనుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మోత్కూరు గుండాలకు చెందిన నరసింహ గత 20 ఏళ్లుగా వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.