HYD: బహుళ అంతస్తుల భవనాలు, లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల ద్వారా రూ.1,225 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. జనవరి నుంచి ఇప్పటివరకు వచ్చిన 3,677 దరఖాస్తుల్లో.. 2,887 అనుమతులు ఇచ్చారని, గతేడాది వచ్చిన పర్మిట్ ఫీజు వసూళ్లతో పోల్చితే 245 శాతం వృద్ధి కనిపించిందన్నారు. కాగా, 2025 సెప్టెంబరులో రూ.135 కోట్లు వచ్చాయన్నారు.