VSP: పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న బైకు సోమవారం ఉదయం వేగంగా వస్తున్న వ్యాన్ మామిడిలోవ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భాధితులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.