MDK: మనోహరాబాద్ మండలం కల్లాకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మన్నే మల్లేష్ (35) మృతి చెందాడు. పటాన్ చెరు మండలం పెద్ద కంజర్లకు మల్లేష్ కూలీ పనుల కోసం శనివారం కాళ్ళకల్ విచ్చేశాడు. రాత్రి రోడ్డు దాటుతుండగా కంటైనర్ లారీ ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు.