CTR: చిత్తూరు నగరంలో ఓ బాణ సంచా వ్యాపారి నుంచి టపాసులు అడిగిన చిత్తూరు తాలూకా ఎస్సై మల్లికార్జునపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ వ్యాపారికి ఎస్సై ఫోన్ చేసి పండగ సందర్భంగా స్టేషన్కు ఎప్పటిలాగే టపాసులు పంపాలని డిమాండ్ చేశారు. వారిద్దరి చరవాణి సంభాషణను ఓ నాయకుడి అనుచరుడు రికార్డు చేసి ఎస్పీ, కలెక్టర్లకు పంపించారు.