KMR: జిల్లాలోని కలెక్టరేట్ ఆవరణలో ఈ నెల 22వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రజని కిరణ్ ఆదివారం తెలిపారు. ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆయన కోరారు. అభ్యర్థులు 30 సంవత్సరాల లోపు ఉండాలన్నారు.