పురాణాల ప్రకారం.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ వనవాసం, లంకాధిపతి రావణుడిపై విజయం అనంతరం, శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు ఈ రోజే తిరిగి వచ్చారు. తమ ప్రియతమ రాజు రాకతో ఆనందోత్సాహాలతో పొంగిపోయిన అయోధ్య ప్రజలు, స్వాగతం పలకడానికి తమ ఇళ్లన్నిటినీ దీపాలతో అలంకరించారు. అప్పటినుంచి ఈ శుభసందర్భాన్ని ప్రజలు దీపావళి పండుగగా జరుపుకుంటున్నారు.