W.G: వాతావరణ మార్పుల ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆక్వా రైతుల్లో ఆందోళన నెలకొంది. మొగల్తూరు మండలంలోని మొగల్తూరు, శేరేపాలెం, కొత్తపాలెం, ముత్యాలపల్లి, కాళీపట్నం, పాతపాడు తదితర గ్రామాల్లో సుమారు 25,000 ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. చెరువుల్లోని నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉండడంతో చేపలు, రొయ్యలు తేలిపోతున్నాయి.