HYDలో మగపిల్లలపై లైంగిక దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో గతేడాది 6 కేసులు నమోదైతే, ఈ ఏడాది 9 నెలల్లోనే 20కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. తెలిసిన వ్యక్తులే ఈ దారుణాలకు పాల్పడుతుండడం గమనార్హం. అశ్లీల వీడియోలు, సామాజిక మాధ్యమాల ప్రభావం నేర ప్రవృత్తి పెరగడానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.