NZB: మోపాల్ మండల కేంద్రంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని యోగా సభ్యులు ఆదివారం రాత్రి ZPHSలో సరస్వతి దేవి విగ్రహం వద్ద 101 ప్రమిదలతో దీపాలను వెలిగించారు. పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవడానికి, బాణాసంచా కాల్చడం తగ్గించి, మట్టి దీపాలు, వెదురు లాంతర్లు, సేంద్రీయ రంగోలి వంటి సహజమైన అలంకరణ ఉపయోగించడం మంచిదన్నారు.