భారత్, సౌతాఫ్రికా మధ్య వచ్చే నెలలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు మొదలవనుంది. ఈ టెస్టును చూడటానికి ప్రేక్షకులను స్టేడియానికి ఆకర్షించడానికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ టికెట్ ధరలు కేవలం రూ.60 నుంచి ప్రారంభం కానుండగా, అభిమానులు రూ.300 టికెట్‌తో ఐదు రోజుల పాటు మొత్తం మ్యాచ్ చూసే ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.