TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం రాష్ట్రంలోని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్ ప్రకటించాయి. ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసు ఇవ్వనున్నారు. సమాఖ్య కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బంద్కు మద్దతు కూడగట్టేందుకు 25న విద్యార్థి సంఘాలతో, 26న సర్వసభ్య సమావేశాలు, నవంబరు 1న అన్ని పార్టీల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు.