HYD: దీపావళి నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ నగర మార్కెట్కు భారీగా పూలు దిగుమతి అయ్యాయి. బంతి, చామంతి, గులాబీ సహా రకరకాల పూలు నగర మార్కెట్కు పోటెత్తాయి. ఆదివారం ఒక్కరోజే హైదరాబాద్లోని మార్కెట్లకు 1.20 లక్షల కేజీల వివిధ రకాల పూలు వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.