BPT: చీరాల ఎమ్మెల్యే కొండయ్య తన క్యాంపు కార్యాలయంలో నిన్న ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 62 మంది లబ్ధిదారులకు రూ.55 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సీఎం సహాయనిధి ఒక గొప్ప వరం లాంటిదని, కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.