బాలీవుడ్ అగ్ర నటుడు సన్నీ దేవోల్ తన 68వ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్రు’ అనే కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ విషయాన్ని ఇన్స్టాలో మోషన్ పోస్టర్ ద్వారా తెలుపుతూ.. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 13న విడుదలవుతుందని చెప్పాడు. శశాంక్ ఉదపుర్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఓం ఛంగని, విశాల్ రానా నిర్మిస్తున్నారు.