పురాణాల ప్రకారం, రాక్షసుడైన నరకాసురుడు ప్రజలను, దేవతలను తీవ్రంగా హింసించేవాడు. నరకాసురుడికి కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే మరణం సంభవించేలా వరం ఉంది. దీంతో అతడిని సంహరించేందుకు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో కృష్ణుడు పడిపోయినట్లు నటిస్తే, సత్యభామ కోపోద్రిక్తురాలై నరకాసురుడిని సంహరించింది. ఈ శుభసందర్భాన్ని ప్రజలు నరక చతుర్దశిగా జరుపుకుంటారు.