NZB: భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.గడ్డం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం ప్రెస్ క్లబ్లో జరిగిన పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా 17వ మహాసభకు ముఖ్య వక్తగా హాజరయ్యారు. గత ఐదు దశాబ్దాలుగా బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తున్నా,తమ సంఘం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు.