MDCL: గంజాయి విక్రేతను నాచారం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కార్తికేయనగర్ స్మశాన వాటికలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు భానుచందర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చత్తీస్ఘడ్, రాయపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి 5 కిలోల గజాయిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.