NLR: సోషల్ మీడియాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే పోస్టులు, ఫార్వార్డులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కందుకూరు సీఐ అన్వర్ బాష హెచ్చరించారు. మత, సామాజిక విభేదాలు రేపే పోస్టులు పెట్టినా, షేర్ చేసినా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.