ADB: తాంసి మండలంలోని బోడ గుట్ట వద్ద గల దుర్గ మాత ఆలయంలో బుధవారం మధ్యాహ్నం చోరీ జరిగిన విషయం తెలిసిందే. గురువారం తాంసి పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. CC కెమెరాలో దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. దుండగుడి వెనక భాగం మాత్రమే కనిపిస్తుండడంతో ఆనవాళ్ళను గుర్తించి సమాచారం అందించాలని తెలిపారు. 8712659927, 8712667483, నెంబర్కు సంప్రదించాలన్నారు.