NDL: దీపావళి పండుగ సందర్భంగా సోమవారం సెలవు దినం కావడంతో ఇవాళ జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు ఎస్పీ సునీల్ శేరన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీ దారులు సుదుర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలతో జిల్లా పోలీసు కార్యాలానికి రావద్దని సూచించారు. జిల్లా ప్రజలు గమనించగలరని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.