ADB: ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు గొప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దండారీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఏత్మాసూర్పెన్కు ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేశారు. అదివారం ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఏర్పాటు చేసిన గుస్సాడీ దండారీ ఉత్సవాలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ప్రసాద్ హాజరయ్యారు.