ప్రకాశం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14, 17 బాలబాలికల జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు ఈనెల 22వ తేదీన కొత్తపట్నం మండలం ఈతముక్కల జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు సమాఖ్య కార్యదర్శి చక్కా వెంకటేశ్వర్లు అన్నారు. అర్హత గల పత్రాలతో క్రీడాకారులు హాజరు కావాలని ఆయన తెలిపారు.