బంగాళాఖాతంలోని వాతావరణ మార్పులతో APలోని పలుచోట్ల మోస్తరు వానలు.. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. TGలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది.