SKLM: పాత టెక్కలిలోని ఓ డాబాపై జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. ఈ దాడి లో ముగ్గురు వ్యక్తులను పట్టుకుని వారి నుంచి రూ. 32,435 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నిహార్ తెలిపారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.