VZM: జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సిబ్బంది కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. 27 మండలాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లు ఎన్నికల్లో పాల్గొని, వారి సమస్యలపై చర్చించారు. ఆనంతరం జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా ఎల్.చంద్ర కిరణ్, సీహెచ్.రామకృష్ణ ఎన్నికయ్యారు.