SRCL: రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు భక్తుల విశ్వాసాలు, అభిప్రాయాలు, పండితులు ఇతర ప్రముఖుల సలహాలు సూచనలు మేరకు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మొదటి దశలో రూ.76 కోట్లతో ప్రధాన ఆలయ విస్తరణ, అభివృద్ధి, రూ. 35 కోట్లతో అన్నప్రసాద వితరణ శాల, రూ. 47 కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.