MDK: దీపావళి పండుగ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోని ఆయా ప్రధాన కూడళ్లలోని వెలిసిన పూజా సామగ్రి, అలంకరణ వస్తువుల దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. పెద్దలు, పిల్లలతో టపాసుల స్టాల్స్ జనసందోహంతో కళకళలాడుతున్నాయి. వినియోగదారుల తాకిడితో దీపావళి శోభసంతరించుకుంది.