WGL: నర్సంపేట నియోజకవర్గం ప్రజలకు అధికారులకు శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో దీపావళి పండుగ నిర్వహించుకుని , పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా ప్రజలకు సూచించారు.