SRCL: తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన దాచారం భూమయ్య (54) అనే గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతిచెందారు. డంపింగ్ యార్డ్ నుంచి తిరిగి వసప్తుండగా, రోడ్డుపై అడ్డం వచ్చిన కుక్కను తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్ను కరెంటు స్తంభానికి ఢీకొట్టడంతో భూమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.