W.G: తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట జంక్షన్ వద్ద ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న 11 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ ఫీల్డ్ ఆఫీసర్ కరుణాకర్ ఆదివారం తెలిపారు. అలాగే నీలాద్రిపురంలో మరో 9 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొత్తం 20 దుంగల విలువ రూ.లక్ష ఉంటుందని, ఇవి కలప పట్టెంపాలెంకు చెందిన కంకిపాటి గన్నియ్యకు చెందినదని అన్నారు