కృష్ణా: విస్సన్నపేట మండల కేంద్రంలో టీడీపీ సీనియర్ నాయకుడు నందమూరి వెంకట్రావు ఆదివారం మరణించారు. ఆయన మృతి పట్ల టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి, పార్టీకి ఇది తీరని లోటని పేర్కొన్నాయి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.