కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆయన ప్రజల భద్రత దృష్ట్యా బాణసంచా నిల్వ, అమ్మకాలపై తనిఖీలు ముమ్మరం చేశారు. లైసెన్సు లేకుండా టపాసులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 101, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.