KDP: పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటామని జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) కె. ప్రకాశ్ బాబు తెలిపారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల కుటుంబాలతో సమావేశమై, వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే సౌకర్యాలపై అవగాహన కల్పించామని చెప్పారు.