ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని చోడవరం అంగన్వాడీ కేంద్రం అధ్వానంగా తయారైందని గ్రామస్థులు పేర్కొన్నారు. సుమారు 2 సంవత్సరముల నుంచి అంగన్వాడీ కార్యకర్త లేకపోవడంతో ఆయా ఒక్కటే ఉంటుందని గ్రామస్థులు అన్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి పిల్లలను పంపడంలేదని తెలిపారు. అధికారులు స్పందించి అంగన్వాడీ కార్యకర్తను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.